– కెసిఆర్‌ కుర్చీ అడిగామా! సర్కారుకు చిత్తశుద్ధి, విధానం లేవు. ఇసుక రవాణా దందాపైనే దృష్టి. పాలన ఒక కుటుంబం కోసం కాదు.
– జెఎసి నేత ఆచార్య కోదండరాం
– మీరు ఎంత మాట్లాడితే అంత మంచిదని గత అనుభవాలు చెప్తున్నాయి.
– వాళ్లది పదవుల కోసం కొట్లాట. మా బాస్‌లు ఢిల్లీలో లేరు, గల్లీలో ఉన్నారు.
– మంత్రి కెటిఆర్‌
– అవును వాళ్లది ఢిల్లీ పార్టీ, మీది గల్లీ పార్టీ. మీకు మీరే బాస్‌లు. వాళ్లకు అధిష్ఠానమే బాస్‌!
– పోరుబాట స్ఫూర్తితో మరో పోరాటం. రానున్న కాలంలో సిపిఐ ఉద్యమాల పార్టీగా మారుతుంది, మొనగాడి పార్టీగా అవతరిస్తుంది.
– సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి
– అంటే ఇప్పటి నుండి మీ పార్టీని ‘భారత కమ్యూనిస్టు పోరుబాట, పోరాట, ఉద్యమాల మొనగాడి పార్టీ’ అని పిలవాలన్నమాట!
– రామాలయం నిర్మాణం విషయంలో రాహుల్‌ గాంధీ తన నిర్ణయం చెప్పాలి.
– భాజపా అధ్యక్షుడు అమిత్‌షా
– వాళ్ల ముత్తాత వ్యతిరేకిస్తే, వాళ్ల నాన్న తాళాలు తెరిచాడు. ఇప్పుడు గుజరాత్‌ ఎన్నికల కోసం అక్కడి హిందూ భక్తుల ఓట్ల కోసం ఇదొక రకమైన ఎత్తుగడ. రేపు గుజరాత్‌ ఎన్నికలవనివ్వండి. జెఎన్‌యులోని, హెచ్‌సియులోని దేశ ద్రోహుల పక్కన నిలబడి ఇదేమాట చెప్తాడేమో చూద్దాం.
– 2019 ఎన్నికల వరకు అయోధ్య అంశంపై ఎలాంటి విచారణ వద్దు.
– సుప్రీంకోర్టును కోరిన కాంగ్రెసు నేత కపిల్‌ సిబాల్‌
– అంటే దీని పరిష్కారం తమకు, తమ పార్టీకి ఇష్టం లేదన్నమాట.
– నరేంద్రమోదిని చూడు. సంస్కారం లేనివాడు.
– కాంగ్రెసు నేత మణిశంకర్‌ అయ్యర్‌
– ఎందుకూ? పాకిస్తాన్‌కు వెళ్ళి శతృశిబిరంలో కూర్చొని విందులారగించి వాళ్లకు మాట ఇచ్చి వచ్చావా? అయినా మీ పార్టీ వాళ్లకు నోటి దురద గాకపోతే మాట్లాడే భాష ఇదేనా! గతంలో మీ మంత్రి బోణీ ప్రసాద్‌ శర్మ మోదీని కుక్క అన్నాడు. దిగ్విజయ్‌ సింగ్‌ మోదిని బండబూతులు తిట్టాడు. నీ నోటికైతే అడ్డూ అదుపు లేనేలేదు. గతంలో సావర్కర్‌పై నీవు నోరుపారేసుకొన్నావ్‌. ‘చాయ్‌వాలా’ అంటూ కాబోయే ప్రధానిని తిట్టిపోశావు. స్వయంగా మీ పార్టీ అధ్యక్షురాలు ‘మృత్యు బేహారి’ అన్నది. మరి మీ చరిత్ర తీస్తే అందులో యజ్ఞాలు, యాగాలూ ఉంటాయని అనుకొంటున్నారా? వదిలిపెడితే మిమ్మల్ని కడిగే వారు భాజపాలో లేరనుకొంటున్నారా!
– వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పోటీ చేస్తారు. రాహుల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా.
– ఆర్‌జెడి నేత లాలూప్రసాద్‌
ఖీ మిమ్మల్ని కాంగ్రెసు అధికార ప్రతినిధిగా ఎప్పుడు ప్రకటించారు ? అయినా ఒక్క ఎన్నికలోనైనా పార్టీని, విపక్షాలను గెలిపించలేని నాయకుడిపై మీకెందుకు అంత వలపు !
– భూస్వామ్య, భూర్జువా విధనాలకు అనుగుణంగా నడుస్తున్న తెలుగు మహాసభలను బహిష్కరించండి.
– విరసం నేత వరవరరావు
– పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకోవడం అంటే అదే. ‘1974లో శ్రీశ్రీ వ్యతిరేకించాడు. ఇప్పుడు మేం వ్యతిరేకిస్తాం’ అంటే ఎంత మూర్ఖత్వం. ‘ఏమి లేని బావ కంటే ముక్కు లేని బావ అందగాడు’ అన్న సామెత మీకు తెలియదా? మీ పార్టీల మద్దతుతో గెలిచిన కాంగ్రెసు పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు. వేరే వాళ్లు చేస్తే అంత కోపం ఎందుకు?
– డా|| పి.భాస్కరయోగి  మాటకు మాట, విశ్లేషణ జాగృతి  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి