- మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు ఇక్కడే తెలంగాణలో ఉండిపోవాలనుంది. కానీ ఏపీలో బాధ్యతలున్నాయి.
– ఏపీ సీఎం చంద్రబాబు
మీరిక్కడికొస్తే అక్కడెవరుంటారు బాబు గారూ..!
- కార్పోరేట్ లబ్దికోసమే పనిచేస్తున్న ప్రభుత్వం! మోదీని కాల్చిపారేసినా పాపం లేదు.
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నారాయణ గారూ.. ‘చైనా గూడ్స్’ అమ్మకం కావడం లేదన్న కమ్యూనిష్టుల అక్కసు మీ మాటల్లో తెలుస్తూనే ఉంది. అయినా ఏ కమ్యూనిష్టో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీరే సభలు పెట్టి స్వాగతించేవారు. మోదీ చేసింది మంచో చెడో మహిళలను అడగండి. మోదీ చేసిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకొన్న మీకు మొన్ననే మీరు దర్శించుకొన్న శ్రీ వేంకటేశ్వర్వస్వామి మంచి బుద్ధి ప్రసాదించుగాక!
- మీ మౌనం దేనికి సంకేతం ?
– కెసిఆర్ ను ప్రశ్నించిన జైపాల్‌రెడ్డి
జైపాల్ గారూ.. మీరు పార్లమెంటులో ఫారిన్ ఇంగ్లీషు మాట్లాడటం తప్ప ఎన్నడైనా అభివృద్ధి గురించి మాట్లాడారా! కొన్నిసార్లు మౌనం కూడా మంచి చేస్తుందన్న సూక్తి తెలియదా మీకు..
- సామాజిక తెలంగాణ కోసమే మహాజన పాదయాత్ర
– సీపిఎం నేత సీతారాం ఏచూరి
మీ పోరాటాలు, పాదయాత్రలు పూర్తయ్యేసరికి కెసిఆర్ మనుమడు పాలనకు వస్తాడు.
- పెద్దనోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.
– భాజపా ఎమ్మెల్యే ఎన్వీయస్‌యస్ ప్రభాకర్
మరి మీరేం చేస్తున్నారు..? ఎక్కడికక్కడ కార్యకర్తల సమావేశాలు పెట్టి ప్రజలలో అవగాహన పెంచొచ్చు కదా..! దేశం మొత్తం ఇంత పెద్ద అల్లకల్లోలం జరుగుతుంటే మీకేం పనిలేనట్టు, ఏమీ పట్టనట్టు గడిపేస్తున్నారు. తెలుగు మీడియా, నారాయణలాంటి వారి విషయంలో మీ స్పందనలు పేలవంగా ఉంటున్నాయి.
- మూటా ముల్లే సర్దుకుని పోగలను; నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ప్రజలే నాకు హైకమాండ్. నేను ఫకీరును !
– ప్రధాని నరేంద్రమోది
మోదీజీ! ఇవాళ డబ్బుతోనే జీవించేవాళ్ళు గంగవెర్రులెత్తుతున్నారు. మీపై కోపం కన్నా మీ నిర్ణయంపైనే వాళ్ళకు కోపం. ఇప్పుడు మీరు కొడుతున్న దెబ్బలకు 2019లో నైనా కోలుకోగలమా..? అనేదే వాళ్ళ బాధ!
- పాలకులు తిడుతున్నారంటే మన త్రోవ కరక్టే
– జేఏసి నేత కోదండరా
ఎంత పేరులో ‘రామ్’ ఉంటే మాత్రం ఇంత సహనమా!
- ప్రజల్లో నిరాశ, నిస్పృహ, ఆక్రోశం, ఆగ్రహం. ఈ రెండున్నరేళ్ళలో ఒరగబెట్టింది ఏమీ లేదు. కష్టాలు ప్రజలకు.. విలాసాలు పాలకులకు..
– పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మరి మీ అరవైఏళ్ళ పాలన లెక్కదీస్తే చాలా ఉంటుంది ఉత్తమన్నా! కష్టాలు, నిరక్షరాస్యత, కర్ఫ్యూలు, మతఘర్షణలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వరదలు, వగైరా వగైరా చాలా ఉంటాయ్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి