– భాజపా ప్రభుత్వం వచ్చాక ఎస్‌.సి.లపై దాడులు పెరిగిపోయాయి.
– కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
 అవును! మీరేమో గత డెబ్భై ఏళ్ల నుండి ఎస్‌.సి.లను తెగ అభివృద్ధి చేసి గౌరవించారు. డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది, బాబూ జగ్జీవన్‌రామ్‌ను అవమానపరిచింది ఏ పార్టీ? ఎస్‌.సి. నాయకుడు సీతారాం కేసరిని ఎఐసిసి కార్యాలయం నుండి అవమానకరంగా బయటకు పంపి అధికారం ఎవరు కైవసం చేసుకొన్నారు..! చరిత్ర చెబితే చాంతడంతవుతుంది..! ఎదుటి వారిపై నిందలు వేయడం మానుకోండి.
– కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కాషాయీకరణ ఆపాల్సిందే. అందుకే మోదీని, భాజపాను గద్దె దింపేందుకు ప్రయత్నం చేస్తాం.
– సిపిఎం నాయకుడు బి.వి.రాఘవులు
– ప్రజల అండ లేనిదే ఏ కాషాయీకరణ అయినా సాధ్యం కాదు రాఘవులూ..
– అంబేడ్కర్‌ స్ఫూర్తిప్రదాత. సామాజిక న్యాయం అంబేడ్కర్‌ చలవే.
– తెలంగాణ సిఎం కెసిఆర్‌
– అందుకే కదా సార్‌ ! అంతగొప్పగా నివాళులు అర్పించారు.
– బహిరంగంగా ఉరితీయాలి. ఆడపిల్లల జోలికొస్తే కఠిన శిక్షే.
– జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌
– ఇది నూటికి నూరు శాతం కరెక్టే. సినీ పరిశ్రమలో ఆడవాళ్లను లైంగికంగా దోచుకురటున్నారట! వేధిస్తున్నారట! ముందు అటు చూడండి.
– దురాక్రమణ కోసమే సిరియాపై వైమానిక దాడులు.
– సిపిఐ (యంఎల్‌)
– ముందు హైదరాబాద్‌ పాతబస్తీ దురాగతాలపై మాట్లాడండి.
– ఇటువంటి పథకాలు గుజరాత్‌లో కూడా లేవు.
– మంత్రి కెటిఆర్‌
– అక్కడ సకుటుంబ సపరివార పరిపాలన లేదుగా..!
– ఆంధ్రాపై పగబట్టిన మోదీ. ¬దా హామీని పట్టించుకోలేదు.
– టిడిపి ఎంపి రవీంద్రబాబు
– హోదా వద్దని, ప్యాకేజి ముద్దని ముందు మీరేగా అన్నారు..!
– మోదీ మోసాన్ని ఎండగడతాం. ముమ్మాటికీ నమ్మకదోహ్రమే.
– ఎపి సిఎం చంద్రబాబు
– మీరు ‘నమ్మకాని’కి బ్రాండ్‌ అంబాసిడర్‌ మరి !!
– మరింత ఉద్ధృతంగా ప్రజా పోరాటాలు
– సిపిఐ నేత నారాయణ
– ఏం! చేసినవి చాలవా ?
– కథువా అత్యాచారం అత్యంత భయానకం
– ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌
– వాస్తవం. దానికి భారత ప్రభుత్వం తప్పక న్యాయం జరిపిస్తుంది. మీరు ఐసిస్‌ బాధితులకు న్యాయం జరిపించండి.
– మతం మారినా అదే కులం ఉండాలి. ఎస్‌.సి.క్రైస్తవులు ఎస్సీలుగానే ఉండాలి. అందుకు రాజ్యాంగ సవరణ చేసేలా పోరాటం. ఎస్‌.సి.లకు అండగా తెలుగుదేశం.
– ఎపి సిఎం చంద్రబాబు
– ఆశ.. దోశ.. అప్పడం.. జగన్‌ని మీ ఉచ్చులోకి లాగడానికా..!

*********************************************************************************
– డా|| పి.భాస్కరయోగి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి