జస్టిస్ పార్టీ ధ్వంసం అయ్యాక కమ్యూనిష్టు పార్టీల ముసుగులో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం మొదలుపెట్టారు. వావిలాల గోపాలకృష్ణయ్యను అడ్డుపెట్టుకొని టంగుటూరి ప్రకాశం పంతులును నాశనం చేశారు. రాజకీయమే కాదు కళారంగాల్లోని వ్యక్తులనూ ఈ ‘కే టీమ్’ వదిలి పెట్టలేదు. గరిమెళ్ల సత్యనారాయణ లాంటి దేశభక్తుడిని, ప్రకాశంలాంటి ఆంధ్రకేసరిని బిచ్చం ఎత్తుకొనేట్లు చేశారు. 1971లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకొని 400 మంది ప్రాణాలను బలిగొన్నారు.
గత ఇరవైరోజులుగా పసుపు పచ్చకామెర్లతో బాధపడుతున్న కులవాద మీడియాను చూస్తే జాలేస్తుంది. ఈ గగ్గోలు వెనుక దాగి ఉన్న కథాకమామిషు ఏమిటి? అని సామాన్యుడు బుర్రబద్దలు కొట్టుకొంటున్నాడు.ఈ వింతరోగానికి కారణం తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రను తవ్వాల్సిందే. తమిళనాడులో ఇ.వి.రామస్వామి నాయకర్‌ను చూసి ఆంధ్రదేశంలో త్రిపురనేని రామస్వామి చౌదరి అరాచక రాజకీయానికి బీజం వేశాడు. తంజావూరులో జరుగుతున్న జస్టిస్ పార్టీ సభకు తన అనుచరులతో వెళ్లి, ఆ సభకు అధ్యక్షులైన బొబ్బిలిరాజును క్రిందకు లాగినంత పనిచేసాడు. అలామొదలైన ఈ వారసత్వం అనేక సందర్భాల్లో ఆంధ్రప్రజలకు శాపంగా మారిపోయింది,. ఈ వారసులే పొట్టిశ్రీరాములును ఆమరణ నిరహారదీక్షకు దింపి, అతను చచ్చేవరకు వదలిపెట్టలేదు.
శ్రీరాములు ప్రాణత్యాగం మీద ఆంధ్రరాష్ట్రం అనే పేలపుగింజలను ఏరుకొని తిన్నారు. జస్టిస్ పార్టీ ధ్వంసం అయ్యాక కమ్యూనిష్టుపార్టీల ముసుగులో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం మొదలుపెట్టారు. వావిలాల గోపాలకృష్ణయ్యను అడ్డుపెట్టుకొని టంగుటూరి ప్రకాశం పంతులును నాశనం చేశారు. రాజకీయమే కాదు కళారంగాల్లోని వ్యక్తులనూ ఈ ‘కేటీమ్’ వదిలి పెట్టలేదు. గరిమెళ్ల సత్యనారాయణ లాంటి దేశభక్తున్ని, ప్రకాశంలాంటి ఆంధ్రకేసరిని బిచ్చంఎత్తుకొనేట్లు చేశారు. 1971లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకొని 400 మంది ప్రాణాలను బలిగొన్నారు. అదే సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రముఖుడైన భోగాది దుర్గాప్రసాద్ పోలీసుకాల్పుల్లో ఆకారణంగా మరణించినా నోరువిప్పని ఈ ఉద్యమకారులు తమ వర్గానికి చెందిన కాకాని వెంకటరత్నాన్ని అమరుల లిస్టులో వేసి పూజించారు.
ఉద్యమం అయ్యాక ఆయన చనిపోతే, మానసిక వత్తిడితో మరణించాడని ప్రచారం చేసారు. ఇదే గుంపు బూర్గుల రామకృష్ణారావుతో కలిసి కుట్రపన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును స్వాగతించారు. తెలంగాణలో నదీ పరీవాహక ప్రాంతాల్లో తిష్టవేసి. తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కారకులయ్యారు. కమ్యూనిష్టు రాజకీయాలను నడిపి తెలుగురాష్ట్రాల ప్రజలకు శాంతిలేకుండా చేశారు. ఒకే వర్గానికి చెందిన లావు బాల గంగాధర్‌రావు, మాకినేని బసవపున్నయ్య, చండ్రరాజేశ్వరరావు వంటి వాళ్లు ఆంధ్రప్రాంతంలో కూర్చొని తెలంగాణ బహుజనులను నక్సలైట్లుగా మార్చేందుకు పరోక్షంగా సహాయపడ్డారు. ఈ పరంపర రెండు ప్రాంతాల్లో సి.పి.ఎం, సి.పి.ఐ ముఖ్య నాయకుల రూపంలో ఈ రోజుకూ కన్పిస్తుంది. ఒకే సామాజిక వర్గం కనుసన్నల్లో ఆంధ్రా, రాజకీయాలు నడవడం ప్రజల దురదృష్టం.
పింగళి దశరధరామ్, వంగనీటి మోహనరంగా హత్యలకు కూడా ఈ సమాజిక ఉద్రేకాలే కారణం. విచిత్రం ఏమిటంటే వీర కమ్యూనిష్టులకు కూడా లోలోపల చంద్రబాబుపై ఎనలేని ప్రేమ అంటే మనం నమ్మలేం. 1984 తర్వాత తెలుగుదేశం విజృంభించాక జస్టిస్ పార్టీ, కమ్యూనిష్టు పార్టీల్లోని కుల అవశేషాలు ఎన్టీఆర్ వెంబడి నిలబడ్డారు. ఎన్టీఆర్ స్వతాగా ఆలోచించే వాడు కాబట్టి కొన్నాళ్లు వీళ్లాటలు సాగలేదు. లక్ష్మీపార్వతి పెళ్లి అన్న నేపాన్ని ఎన్టీఆర్‌పై నెట్టి వైస్రాయి హోటల్‌పై దాడిచేయించి తండ్రిని చంపిన జౌరంగజేబులా చంద్రబాబు గద్దెనెక్కాడు. చంద్రబాబు దాష్టికాల వల్ల తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవం దెబ్బతిని, ఇక్కడి ప్రజలు ప్రత్యేక ఉద్యమానికి తెరలేపారు.
ఉధృతంగా ఉద్యమం నడుస్తున్న సమయంలో చంద్రబాబు అమాయకంగా నటించాడు. రెండు ప్రాంతాలు నాకు రెండుకళ్లు అన్నాడు. మళ్లీ అక్కడ వైఎస్ జగన్ మైలేజ్ తీసుకుంటున్నాడని తెలియగానే కృత్రిమ ఉద్యమానికి తెరతీయించాడు. 1953, 1971, 214 సంక్షోభాల్లో ఇలాంటి దగుల్బాజీలే ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచడానికి కారణమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కిరణ్‌కుమార్ రెడ్డిని డమ్మీగా చేసి, సరిగ్గా ఈ రోజు ప్రత్యేక హోదాకు గగ్గోలు పెట్టినట్లే ఆనాడు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు. తెలంగాణ ఇచ్చేసమయానికి మోదీ హవాను గమనించి, సందుచూసి వెంకయ్య నాయుడి చంకనెక్కి భాజపా పంచన చేరాడు. గుజరాత్ అల్లర్ల అనంతరం ఆ నరేంద్రమోదీని నిందించి, ఆనాటి భాజాపాతో పొత్తును నట్టేట ముంచి, ఏపీభవన్‌లో కూర్చొని మోదీ కి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు 2014 ఎన్నికల్లో మోదీని ఆకాశానికెత్తేశాడు.
తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడవడానికి పరుచూరి ఆశోక్‌బాబు సారధ్యంలో మంచి కథనే నడిపాడు. ప్రాప్తకాలజ్ఞత లేకుండా ఆనాడు విభజన అనివార్యం అనితెలిసినా చంద్రబాబు ఎన్నోకుయుక్తులు పన్నాడు. ఈ కుయుక్తులకు పన్నాడు. ఈ కుయుక్తులకు కాంగ్రెస్ పార్టీ కుట్రతో ఎదుర్కోవాలని ప్రయత్నించింది. కాంగ్రెస్‌లోని చంద్రబాబు మనిషులు లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్‌లాంటి కోవర్టులు కాంగ్రెస్‌ను నిండా ముంచేందుకు ఓవర్‌యాక్షన్ చేశారు. బ్రహ్మస్త్రం మాదగ్గర ఉందని చివరకు పార్లమెంటులో పెప్పర్‌స్ప్రే బయటకు తీసారు. అదే సమయంలో కాపు జట్టు చీలకుండా, కాంగ్రెస్‌లోని చిరంజీవి ఓట్లను తనవైపు తిప్పుకోవడానికి పవన్ కల్యాణ్ అనే తలారిని తనపక్కన పెట్టుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌ను దెబ్బతీసినా, జగన్‌ను దెబ్బతీయలేకపోయాడు.
ఎన్నికల అనంతరం జగన్ ఎమ్మెల్యేలను అంగడిసరుకులా తన వైపులాక్కొని రాజకీయం రంగు మార్చాడు. ఎన్టీఆర్‌ను దేవుడు అని పొగుడుతూనే ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన మానసికక్షోభకు కారణమయ్యాడు. చంద్రబాబు అదే దారిలో 2014లో నరేంద్రమోదీ ని ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడి ఇరవైరోజుల నుండి తీవ్రంగా నిందించడం వెనుక కారణం...!? ఇటీవల వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడం, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతరావడం, అక్రమంగా ఏమీ తెలియని లోకేశ్‌ను గద్దెమీద కూర్చో బెట్టడం, పోలవరంకన్నా పట్టిసీమపై మక్కువ చూపడం వంటి అంశాల్లో ప్రజావ్యతిరేకత మూటగట్టుకొంటున్నాడు.
జగన్ గ్రాఫ్‌ను తగ్గించాలంటే భాజాపాపై శత్రుత్వంతో ఉన్నట్లు తీవ్రతను ప్రదర్శించాలనుకొన్న చంద్రబాబు కపట వ్యూహమే ఈ గగ్గోలుకు ప్రధానకారణం. అన్ని అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న జగన్‌ను ఢీకోనడం కన్నా, అమాయకంగా చంద్రబాబును నమ్మిన భాజపాలోని ఓ వర్గం పై యుద్ధం ప్రకటిస్తే, వాళ్లు తేరుకొనేలోపే ఏరుదాటి తెప్ప తగిలేయవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన, కానీ అద్వాణీ, వాజ్‌పేయ్‌ల్లా కేంద్రంలో సత్వగుణ సంపన్నులు లేరు. రాజకీయంనుండి రాక్షసినిపుట్టించే అపరచాణక్యులు అమిత్‌షామోదీలు. చెఱుకుగడను పిండుకొని త్రాగాక పిప్పికూడా మిగలకుండా చేమగల వాళ్ల సమర్థతకు ఉదాహరణలు ఎన్నో చెప్పొచ్చు. గతంలో నీలం సంజీవరెడ్డి ఇలాంటి వేషాలే వేసి ఇందిరాగాంధీని ఇబ్బందిపెడితే ఆమె నీలాన్ని పదేళ్లు నిమ్మతోటకే పరిమితం చేసింది.
మోదీ, షాలు స్కెచ్‌వేస్తే ఎలాఉంటుందో దమ్మున్న చానల్ రోజూ దగ్గుతూనే ఉంది. ఫరూఖ్ అబ్దుల్లా, ములాయం, లాలూ, దేవేగౌడ, చౌతాల, నవీన్‌పట్నాయక్, శరద్‌పవార్, శరద్‌యాదవ్, వంటి రాజకీయ యోధాన యోధులే మోదీతో సయోధ్యకోసం సందులో కలుస్తున్నారు ! ఇప్పటివరకు నరేంద్రమోదీపేరు ఫోటో ఆంధ్రప్రాంతంలోని సామాన్య ఓటర్లకు తెలిసేది కాదు. చంద్రబాబు పుణ్యమా అని మోదీ ఇంటింటికి పరిచయం అయ్యాడు. ఇంకా ఎన్నికలు 14 నెలలు ఉన్నాయి. ఈ మధ్యలో జరిగే రాజకీయ పరిణామాలు చంద్రబాబును సంక్షోభంలోకి నెట్టడం ఖాయం. ఈ పరిణామాలు అన్నీ తెలిసే చంద్రబాబు రాత్రింబవళ్లు చెప్పిందేచెప్పి ఊదరగొడుతున్నాడు.
పదేళ్లు తెలంగాణ ప్రాంతంలో పిట్టల్లా 1300మంది బలిదానాలు చేసుకొంటే కిమ్మని, సోనియాగాంధీ వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేయని ప్రసార మాధ్యమాలు, ఓకులవాదిని మానసిక విశ్లేషకుడిగా ప్రాజెక్టు చేసి మోదీని తిట్టిస్తున్నాయి. ఇలాంటి కుట్రలు చంద్రబాబు ప్రదర్శించినందువల్లనే తెలంగాణలో తెలుగుదేశం నామరూపాల్లేకుండా పోయింది. తెలంగాణ వచ్చాక తెరాసప్రభుత్వాన్ని పడగొట్టాలనే బాబుగారి దురూహను అదే పాఠశాలలో చదువుకొన్న కేసీఆర్ పసిగట్టి అమరావతికి పంపించాడు. అమరావతిని భ్రమరావతిగా మార్చి ఎప్పుడోకట్టిన బుద్ధవిగ్రహం పక్కన మురికి తుమ్మలు కూడా పీకకుండా నేను విశ్వనగరంగా చేస్తానని నారాయణలాంటి మంత్రితో చెప్పిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్‌కల్యాణ్ చల్లిన బురదను కడుక్కోవడానికి ఈ పదిహేనురోజులు చాలడంలేదు.
మరోవైపు జగన్ ఢిల్లీ ఎంపీలతో వేయిస్తున్న ఎత్తులు బాబుకు నిద్రపట్టనివ్వడంలేదు. ఇక బీజేపీ రామ్‌మాధవ్ లాంటి అపరచాణక్యుడితో ఆపరేషన్ మొదలుపెట్టింది. మరోవైపు సోషల్‌మీడియా బాబు స్టంట్‌లను బట్టబయలు చేస్తున్నది. ఇవన్నీ ఇంత తీవ్రంగా ఉంటే తాను గొప్పశ్రామికుడిలా ఫోజులివ్వడం జస్టిస్‌పార్టీ, కమ్యూనిష్టు పార్టీల నటనే... దుర్గగుడి ఫ్లుఓవర్ ప్రారంభం మూడుసార్లు వాయిదా పడడం, ఉత్తరాదికి చెందిన అశోక్ సింఘల్‌ను తితిదే ఈవోగా నియమించడం వెనుక కారణాలు ప్రజలు ఆలోచించడం, డబ్బుతో దొరికిన శేఖర్‌రెడ్డి లోకేశ్ సంబంధాల రహస్యాలు బయట పడుతుండడం, ఇసుక మాఫియా సంగతి బయల్పడడం, దుర్గగుడిలో తాంత్రిక పూజలు, అమరావతిలో అక్రమాలు ఇవన్నీ మటుమాయం చేయడానికే చంద్రబాబు ఆడుతున్న కొత్తనాటకం ఆంధ్రప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి కుటిల రాజకీయాలే ఆంధ్రప్రజలకు ఆనాటినుండి ఈనాటి వరకు శాపంగా పరిణమించాయి. ఆంధ్రుల అభివృద్ధిని అడ్డుకొనే ఈ పరిణామాలకు ఇప్పుడు పెట్టిన కొత్తపేరు ప్రత్యేక హోదా. ఈ పాపాల బైరవుల చివరి అవతారం చంద్రబాబు.
***************************************************
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి