భారతీయ మహర్షులు కనుగొన్న సిద్ధ విషయాల్లో ‘యోగం’ కూడా ఒకటి. మానవుణ్ణి మోక్ష సాధనవైపు తీసుకెళ్ళే పరమోపాయం ‘యోగం’. దీన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ వ్యాప్తం చేశారు. బ్రహ్మ తాను బ్రహ్మయోగాన్ని ఋషులలో వేదర్షి అయిన యాజ్ఞవల్క్య మహర్షికి ప్రబోధించాడు. యాజ్ఞవల్క్య మహర్షి ఆ ‘బ్రహ్మయోగాన్ని’ తన ‘జాయ’ అయిన గార్గి (గార్గేయి)కి ఉపదేశించాడు.
అయితే ఆ ‘హిరణ్య గర్భ యోగం’ లుప్తం అయ్యిందనుకున్న సందర్భంలో ఇటీవలనే దాన్ని పరివ్యాప్తిలోకి తెచ్చినవారు శ్రీ రుష్యేశివయోగీంద్రులు. అందులో అష్టాంగయోగం, కొన్ని ముఖ్య ఆసనాలు చెప్పి అసలైన యోగాన్ని ప్రతిపాదించాడు.
అలాగే విష్ణువు తాను కృష్ణావతారంలో యోగశాస్త్రాన్ని శ్రీమద్భగవద్గీత రూపంలో అర్జునుడికి ఉపదేశించాడు. ఉపనిషత్తుల సారాన్ని మొత్తం రంగరించి, అన్ని మతాల (శైవ, వైష్ణవ) తత్త్వాన్ని శ్రీకృష్ణుడు జాతికి అందించాడు. మహేశ్వరుడు ‘హఠయోగాన్ని’ ఘేరండ సంహిత, శివసంహిత, హఠయోగప్రదీపిక, హఠరత్నావళి రూపంలో పార్వతికి ప్రబోధించారు. ఈ మూడూ లోకంలో ప్రసిద్ధమైన యోగ శాస్త్ర గ్రంథాలు.
విచిత్రం ఏమిటంటే ఈ మూడు యోగశాస్త్రాలు స్ర్తిలకే చెప్పబడడం విశేషం. (బ్రహ్మయోగం - గార్గేయి, విష్ణుయోగం - అర్జునుడు, అర్జునుడుకూడా శాపవశాత్తు విరటుని కొలువులో స్ర్తిగా వ్యవహరించినవాడే కదా!) శివయోగం- పార్వతి)
అయితే కలియుగంలో యోగం భ్రష్టుపట్టిందని చెప్పవచ్చు. గీతలో కృష్ణుడు అన్ని విషయాలను చెప్పి ‘తస్మాద్యోగీభవార్జునా’ అంటాడు. యోగంలో జీవాత్మ పరమాత్మ కలయిక ప్రధానమైనది.
‘జీవాత్మ పరమాత్మ సంయోగే యోగ ఉచ్యతే’ అంటాడు యాజ్ఞవల్క్యుడు. అలాంటి యోగ తత్త్వాన్ని విడిచిపెట్టి యోగం అంటే కేవలం అష్టాంగయోగంలో భాగమైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిదింటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇవన్నీ ఆరోగ్యాన్ని సాధించి శరీరాన్ని నిలకడ చేసుకొని స్థిరమైన మనస్సుతో ఆ పరమాత్మను ఉపాసించడానికే అన్న విషయం మరువకూడదు. పరమాత్మను చిత్తం ద్వారానే ప్రార్థించడమే యోగం అన్న అసలు సూత్రాన్ని మన యోగవేత్తలు మరచిపోయారు.
కేవలం అష్టాంగయోగంపైనే మనం దృష్టి పెట్టడం జరుగుతున్నది. అసలు యోగం ‘నిజ యోగం’లోని గొప్ప గొప్ప విషయాలు మరచిపోయాం. లోతైన పరిశోధన లేకుండా పోయింది. తత్వదృష్టి తగ్గిపోయింది.
పోను పోను ఈ గొప్ప గొప్ప యోగ శాస్త్రాల పేర్లు, యోగవిద్య భారతదేశం నుండి వెళ్లిపోయి, ఇతర దేశాల పేటెంట్ హక్కుగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు.
కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని మన శాస్త్రాలపట్ల సరైన గౌరవం కలిగి, ఆ శాస్త్ర సంపదను ముందు తరాలకు అందించాలి.

************************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ॐ మంగళవారం 卐 ఏప్రిల్ 24 卐 2018 ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి