ఇప్పుడు మన దేశంలో సూడో సెక్యులర్ పార్టీలకు భాజా వాయించే ప్రసార మాధ్యమాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏదో భూకంపం వచ్చినట్లు చెలరేగిపోయి దెబ్బతిన్నారు. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రకు ఏదో జరిగిపోయిందన్న భ్రమను కల్పించి భౌతిక దాడులను కూడా సమర్ధిస్తున్నారు.  తమకిష్టమైన రాజకీయ నాయకులపై ఈగ వాలినా సహించని ప్రసార మాధ్యమాలు తమకు నచ్చని వారిపై దాడి జరిగినా పట్టించుకోలేదు 

ఒక అమాయకుడు మేకపిల్లను తీసుకొని వెళ్తున్నాడట. నలుగురు యువకులు ఎలాగైనా ఆ మేకపిల్లను అతని దగ్గరి నుండి సులభంగా లాక్కోవాలనుకొన్నారు. అందుకోసం ఓ ఉపాయం పన్ని మొదటివాడు ఈ అమాయకుడికి అడ్గుగా వచ్చి “ ఏమండీ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని ప్రశ్నించాడట నా దగ్గరకుక్కేమిటి? నేను తీసుకెళ్తున్నది మేకపిల్ల కదా? అన్నాడా అమాయకుడు. ‘ అయ్యో! మీ ఇష్టం’ అనుకుంటూ ఒక యువుకుడు వెళ్లిపోయాడు. ఇతను మరి కొంత ముందుకు సాగగానే రెండవ యువకుడు వచ్చి ‘ఏమిటండి బాబూ! కుక్కను తలపై పెట్టుకొని మోస్తున్నారు?’ అన్నాడట. ఇతనిలో అనుమానం ప్రారంభం అయ్యింది.

మూడవ వాడు వచ్చి ‘కుక్కను తీసుకెళ్లి ఏం చేస్తారండి బాబూ’? అనగానే ఈ అమాయకుడిలో అనుమానం బలపడింది. నాల్గవ వాడు కుక్క అని నోరు తెరవగానే ‘ఇదిగో నాయనా! ఇది కుక్కే! తీసుకో!’ అని ఇచ్చేసి వెళ్లిపోయాడట.. ఇదే మైండ్‌గేమ్ అంటే. గత డ్బ్బు ఏళ్ల నుండి ‘సెక్యులరిజం’ అనే మైండ్‌గేమ్‌తో సూడో సెక్యులర్ నాయకులు, మేధావులు ఈ దేశ రాజకీయాలను తారుమారు చేస్తూనే వస్తున్నారు. జాతీయవాద రాజకీయాలను తమకు నచ్చిన విధంగా దుష్ప్రచారం చేసి గద్దెపైన కూర్చొన్నారు. ఆఖరుకు శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వారు ప్రాణాలే వదలిపెట్టారు. ఎ.బి.వాజ్‌పాయి, ఎల్‌కే ఆడ్వాణీ కాలంలో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు గుంపు, కులవాద కుటుంబ పార్టీలు, ప్రసార మాధ్యమాల్లో తిష్టవేసుక కూచున్న మేధావులు ఇవే పద్ధతులను ప్రయోగిచారు.

దేశంలో ఏ సంఘటన జరిగినా, జాతీయవాద రాజకీయాలు ఎవరు చేసినా ఏదో అపచారం జరిగిపోయిందని భ్రమకల్పించే దుష్ప్రచారం కొనసాగింది.అయితే ఇది దీన్‌దయాల్ ఉపాధ్యాయ, శ్యామా ప్రసాద్ ముఖర్జీల కాలం కాదని, ఎ.బి.వాజ్‌పాయి, ఆడ్వా ణీల కాలం అసలే కాదని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. మోదీ, షాలు ఆత రం మనుషులు  కాదని గ్రహించగానే గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారు. 
అప్పుడప్పుడు ‘గోబెల్స్ ప్రచారం’ అన్నమాట చాలా మంది వాడుతారు. పాల్ జోసెఫ్ గోబెల్స్ నాజీ రాజకీయవేత్తనే గాక హిట్లర్ ప్రభుత్వంలో ప్రచార మంత్రి కూడా.. ఆడాల్ఫ్ హిట్లర్ చేసే అన్ని నియంతృత్వ పనులను గొప్ప పనులుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దిట్ట. అంతేగాకుండా మాధ్యమాల హోరు తక్కువగా ఉన్న ఆ కాలంలో హిట్లర్ నియంతృత్వాన్ని అంగీకరించడానికి ఇతను సర్వ శక్తులూ ఒడ్డేవాడు.

అలాగే హిట్లర్ ఏమంత అద్భుతమైన ఉపన్యాసకుడు కాడు. కానీ హిట్లర్ మాట్లాడే సభలో కొందరు మనుషులను ముందే ఏర్పాటు చేసి వారిచేత కరతాళ ధ్వనులు చేయించేవాడు. ప్రజల మధ్య నుండే చప్పట్లు వినిపిస్తే అవి మిగతా వాళ్లకు ఉత్పేరకంగా పనిచేసేవి. సరిగ్గా ఇప్పుడు మన దేశంలో సూడో సెక్యులర్ పార్టీలకు భాజా వాయించే ప్రసార మాధ్యమాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏదో భూకంపం వచ్చినట్లు చెలరేగిపోయి దెబ్బతిన్నారు. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రకు ఏదో జరిగిపోయిందన్న భ్రమను కల్పించి భౌతిక దాడులను కూడా సమర్ధిస్తున్నారు.  తమకిష్టమైన రాజకీయ నాయకులపై ఈగ వాలినా సహించని ప్రసార మాధ్యమాలు తమకు నచ్చని వారిపై దాడి జరిగినా పట్టించుకోలేదు.

ఐదు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా తిరుమల శ్రీ వేంకటేశ్వరున్ని దర్శించుకొని వస్తుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలిపిరి దగ్గర ఆయనపై రాళ్లదాడి చేశారు. అది ఆయన కాన్వాయ్‌పై పడి అద్దాలు పగిలాయి. కానీ మీడియా దానిని ఓ వార్తగానే చూపించింది. కాస్త ఓ ఊహలోకి వెళ్దాం. అదే దాడి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే చాంపియన్ అనుకున్న అంచనాలు తలక్రిందులై పచ్చ మీడియా ఆత్మ రక్షణలో పడింది. ఈ సత్యం సిద్ధరామయ్యకు బోధపడింది కానీ కులగజ్జితో కునారిల్లుతున్న నటుడు శివాజీకి, ఎక్జీవో సంఘాల నేత కె. అశోక్‌బాబుకు, స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్‌కు అర్ధం కాలేదు.

ఇక నిత్యం భాజపా, మోడీ, అమిత్‌షాలపై లోకంలోని దుమ్మునంతా ఎత్తిపోసే కమ్యూనిస్టుల రాక్షసానందం వర్ణించలేం. నిజానికి అనేక బాలారిష్టాల్లో ఉన్న కర్ణాటక భాజపాను ఓ స్థాయికి తేవడానికి ఈ పదిహేను రోజుల్లో మోదీ, షాల ప్రయత్నం రేపటి ఫలితం వెల్లడిస్తుంది.కోర్టులు క్లీన్‌చీట్ ఇచ్చినా యెడ్యూరప్పను మీడియా బోను ఎక్కించింది. కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై ఉన్న రాహుల్, సోనియాలు యోధులట. ఇదంతా రాజకీయం.ఇక సామాజికంగా భాజపాను, మోదీని అపఖ్యాతి పాలుజేయడంలో శత్రువులు, ప్రియమైన శత్రువులు కాస్త ముందంజలోనే ఉన్నారు. ఇన్నాళ్లు మెజార్జీలను బూచిగా చూపి సంతుష్టీకరణ రాజకీయాలు చేసిన కాంగ్రెస్,  కమ్యూనిస్టులు, సూడో సెక్యుల్ కుటుంబ పార్టీలు ఈ నాలుగేళ్లలో ఓ సత్యం గ్రహించాయి. మెజార్టీ రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించి దేశం మొత్తం కులాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారు. ఆనాటి హెచ్‌ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో ఆధారాలతో చేసిన ఉద్వేగ ప్రసంగం వీళ్ల అసలు రంగు బయటపెట్టింది. అప్పటి నుండి ప్రారంభం అయిన కుల రాజకీయం దేశంలోని ప్రతి సంఘటనకు రుద్దుతూ కులాల మధ్య సంఘర్షణ సృష్టిస్తున్నారు. ఆఖరుకు కర్ణాటక ఎన్నికలకు ముందు బ్రిటీష్ ఎనలిటికా అనే సంస్థను కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి మరీ ఈ కుల ఘర్షణలను సృష్టించడానికి ఏర్పాటు చేసిందని రిపబ్లిక్ టీవీ ఆధారాలతో సహా బయటపెట్టింది. దాని ప్రభావం ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిబంధనల సవరింపు తర్వాత జరిగిన అల్లర్లలో బయల్పడింది. ఈ అల్లర్లలో పది మందికిపైగా మరణించారు.

స్థానికంగా దాద్రీలో జరిగిన అఖ్లాఖ్ హత్యను బీహార్ ఎన్నికల ముందు పరచారంలోకి తెచ్చినట్లే కర్ణాటక ఎన్నికలకు ముందు కథువా, ఉన్నవా రేప్ ఘటనలను భూమ్యాకాశాలను ఏకం చేసి ప్రచారం చేశారు. అందులోని నిజా నిజాలను బయటపెట్టగానే అందరి నోళ్లు మూతబడ్డాయి కానీ జరగాల్సిన దుష్ప్రచారం జరిగిపోయింది. మరోవైపు మోదీని నియంతృత్వ మనస్తత్వం ఉండే వ్యక్తిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే తనకు సంబంధించిన వాళ్లెవరినీ దగ్గరకు రానీయడం లేదని ఇంకొందరు తెగ బాధపడిపోతున్నారు. బయటకు సెక్యులర్ ముసుగేసుకొని కుటుంబాలు, కులాలు నడుపుతున్న పార్టీల్లో వారసత్వ రాజకీయం కాక ఇంకేముంది? ప్రతి రాష్ట్రాన్ని కొన్ని కుటుంబాలు, కులాలు నడుపుతున్నా కిమ్మనని ఈ మేధావులు మోదీని నిరంకుశుడిగా, ఎవ్వరినీ చేరదీయని వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు.

ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు రాష్ట్రాలను కుటుంబాలకు ధారదత్తం చేస్తున్న వీళ్లు కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఒకే కుటుంబం చేతిలో దేశాన్నిపెట్టి రాష్ట్రానికో సామంత కుటుంబం తయారు చేసి పాలిస్తుంటే అది గొప్ప ప్రజాసామ్యమా? 2019లో నేనే ప్రధానినని ఏకపక్షంగా ప్రకటించి పార్లమెంటరీ వ్యవస్థను ఆత్మరక్షణలో పడేసిన వారి కుటుంబం గొప్ప ప్రజాస్వామ్య లక్షణం కలిగి ఉందా? సీతారాం కేసరి, పి.వి, ప్రణబ్‌ముఖర్జీ, మన్మోహన్‌సింగ్, మోతీలాల్ రోరాలను ట్యూషన్ పిల్లల్లా చేసి అధికారం చెలాయించిన సోనియాగాంధీ గొప్ప ప్రజాసామ్యవాది! అధికారం వచ్చిన నాటి నుండి ఒక్క రోజు కుటుంబంతో గడపని వ్యక్తి, దేశం కోసం సర్వస్వం అర్పించిన ప్రధాని మోదీ నిరంకుశుడా! అధికారం కోసం కులాలు, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడిపే వాళ్లకు తాము లక్ష్యం చేసుకొన్న వాళ్లను ఓడించడం కన్నా దుష్ప్రచారం చేయడం సులభం, అందుకే దుష్ప్రచారం దుమ్ములాలేస్తుంది.

చంద్రబాబుపై ఢిల్లీలో జరిగిందని అనుకొందాం. మీడియా మొత్తం తన రోజువారి కార్యక్రమాలు వదిలేసి చంద్రబాబుపై కవరేజ్ పెట్టేది టీవీలు, చర్చలు, వార్తలు, వ్యాఖ్యానాలు అన్నింటిలో హిందూ మహాసముద్రంలోని బురదనంతా తెచ్చి భారతీయ జనతా పార్టీపై వేసేవి. మోదీ, షాలు నియంతలని ఒకాయన విశ్లేషణ చేస్తే వాళ్ల సైకాలజీని ఓ కుల విశ్లేషకుడు అద్భుతంగా నిందించేవాడు. ఇక స్వయం ప్రకటిత మేధావులు, రాజకీయ ముసుగులో, సిద్ధాంతాల ముసుగులో ఉన్న  కులవాదులు దీనిపై మోదీ స్పందించాలని, వీలైతే నరేంద్రమోదీ తెలుగుజాతికి క్షమాపణ చెప్పాలని అడిగేవారు. ఇప్పుడు తెలుగుదేశమే తెలుగుజాతి ఉన్న భ్రమ కల్పించడంలో వారు కృతకృత్యులయ్యారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆర్ట్స్ సబ్జెక్ట్ దండగ అన్న మహా మేధావి. ఆయన ఇప్పుడు తెలుగు జాతి ఐకాన్! విచిత్రం ఏమిటంటే రాజకీయ పార్టీల కన్న ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియా మిడిసి పడుతోంది. మోదీని తిట్టడానికి యాంకర్లు కూడా ఉబలాట పడిపోతున్నారు. పవన్‌కల్యాణ్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు చేయగానే సినిమా, రాజకీయ నాయకులంతా లోలోపల మీటింగ్‌లు పెట్టి ఆ విషయాన్ని ఆ రోజుతో సమాధి చేశారు. కానీ గత 40 రోజుల నుండి  తెలుగు మీడియా మోదీని విలన్‌గా మార్చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా! వద్దా! అన్నది మోదీ వ్యక్తిగత ఇష్టమా! వ్యవస్థాగతమైన నిర్ణయమా! కేంద్రం ఇస్తేనే అన్ని పనులు చేస్తామంటున్న తెదేపా ప్రభుత్వం గెలుపు కోసం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను మీడియా ఎందుకు ప్రశ్నించదు? హోదా పేరుతో జనాన్ని మభ్యపెట్టి రోజువారీ పాలనను ఓ సంవత్సరం ముందే గాలికొదిలేసి మీడియా, ప్రభుత్వం కేంద్రంపై దుష్ప్రచారం మొదలుపెట్టింది.

రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం జనబలంతో బ్రతుకుతున్నాయా? ఇన్నాళ్లు కేంద్రం ఇచ్చే వనరులతోనే నడుస్తున్నాయా? ఈ మౌలిక ప్రశ్నలను విస్మరించిన కొన్ని మాధ్యమాలు ఏ రక్త సంబంధమో తెలియదు గాని చంద్రబాబుపై విపరీతమైన సానుభూతి వర్షం కురిపించడం కోసం రంగంపై ఇంకా కుదురుకోని బీజేపీని, మోదీ, అమిత్‌షాలను రాక్షసులుగా చిత్రీకరిస్తున్నది. దేశంలోని మాధ్యమాల్లో మారో వర్గం మోదీ, షాల వియోత్సాలను నియంతృత్వాలుగా చిత్రీకరిస్తున్నది. ఎన్నో రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు గెలిస్తే అవి అధికార పార్టీ ఎలాగూ గెలుస్తుందిలే అని ప్రచారం చేయడం, బీహార్, ఢిల్లీల్లో భాజపా అధికారం కోల్పోతే ‘దేశం మార్పును కోరుకొంటోంది’ అని బాకా ఊదడం జరిగింది.

భాజపా అతిపెద్ద యూపీలో గెలిస్తే దాంట్లో కోడిగుడ్డుపై ఈకలు పీకడం అదే యూపీ, బీహార్‌కు సంబంధించిన గోరఖ్‌పూర్, పుల్ఫూర్‌లో ఓడిపోతే అసలు మోదీ రాజకీయ నాయకుడే కాదు అని వ్యాఖ్యానించడం వెనుకు అసలు కుట్ర ఏమిటి? కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో గెలిస్తే వెంటనే ‘మావో విగ్రహాల విధ్వంసం’ అనే స్థానిక ఇష్యూను మోదీనే దగ్గరుండి చేయించాడన్నట్లుగా ప్రచారం చేయడం వెనుక మతలబు ఏంటి? ఈ డ్బ్బు ఏళ్లలో ఏ నాడు ఎన్నికల్లో ధనం వాడలేదన్నట్లు, కర్ణాటక ఎన్నికల్లో మాత్రమే మొదటి సారి ధనప్రవాహం ఉందని పత్రికల యాజమాన్యలే విశ్లేషణ చేయడం విడ్డూరం! ఇక కర్ణాటకలో జరిగిన ఎన్నికలను తెలుగు మీడియా, నాయకులు రణరంగంగా చేసి ప్రచారం చేశారు. నిజానికి 20రోజుల క్రింద వరకు కన్నడ ప్రాంతంలో సిద్ధరామయ్య ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారి హీరో అయ్యాడు. భాజపాకు బలమైన మద్దతుదారులైన లింగాయత్‌లను విభజించాలనే తీర్మానం కేంద్రం మీద నెట్టేసి రాక్షసానందం పొందాడు. విచిత్రంగా అది వికటించి మోదీ ప్రచారంలోకి అడుగుపెట్టాక సీను మారిపోయింది.

****************************************************

ॐ卐 డాక్టర్. పి. భాస్కర యోగి ॐ卐 ॐ卐 సంపాదకీయ వ్యాసం ॐ卐

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి