– 2జి స్పెక్ట్రమ్‌లో కుంభకోణమే లేదు. రాజా, కనిమొళితో సహా 17 మంది నిర్దోషులే. అవాస్తవాలు కల్పితాలు కలిపి పోగేశారు.
– సిబిఐ కోర్టు తీర్పు వ్యాఖ్యలు
– అంత చక్కగా ఫైల్‌ను ప్రమోట్‌ చేసిన నాటి యూపిఎ ప్రభుత్వాన్ని, ఇంత చక్కగా కేసును నీరుగార్చిన నేటి సిబిఐని అభినందించాల్సిందే.
– సైన్సు కాంగ్రెసును భద్రతా కారణాల వల్లే వాయిదా వేశాం
– ఓయు విసి
– మనం అంత అభద్రతలో ఉన్నామా !
– మోది, జైట్లీ క్షమాపణ చెప్పాలి.
– కాంగ్రెసు నేతలు వీరప్ప మొయిలీ, రణదీప్‌ సూర్జెవాలా
– కొంచెం ఆగండి! ముందుంది ముసళ్ల పండుగ.
– అమిత్‌షా కుమారుడిపై సిబిఐ విచారణ చేపట్టాలి
– కాంగ్రెసు నేత షబ్బీర్‌ అలీ
– ముందు నీపై వచ్చిన ఆరోపణలపై జాగ్రత్తగా ఉండు సుమా!
– గుజరాత్‌ ఫలితాలపై నిరాశ లేదు. ఫలితాలు సంతృప్తినిచ్చాయి. ప్రజలిచ్చిన తీర్పును అంగీకరిస్తున్నాం.
– రాహుల్‌గాంధీ, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
– జియస్‌టిని గబ్బర్‌సింగ్‌ టాక్స్‌ అన్నారు. నోట్ల రద్దు శరాఘాతం అన్నారు. కుల సమీకరణాలను నమ్ముకున్నారు. ప్రజలు ‘మోది జిందాబాద్‌’ అన్నారు. మీడియా మీదే విజయం అంటున్నది. ఇది మీకు వికృతానందమే !
– దయామయుడైన యేసు ప్రభువే సిఎం కెసిఆర్‌ రూపంలో సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా క్రిస్టియన్లకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది.
– తెరాస మంత్రి లక్ష్మారెడ్డి
– కొంపదీసి కొత్త ‘బైబిల్‌’ రాస్తారా ఏంటి ?
– తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి బలం లేదు.
– తెరాస ఎంపి కవిత
– అవును! గతంలో మహబూబ్‌నగర్‌లో భాజపా అభ్యర్థి చేతిలో తెరాస ఓడిపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీ ప్రసాద్‌ను ఢికొట్టి రాంచందర్‌రావు గెలవడం బలమా! బలహీనతా! పార్టీలకు బలాలు – బలహీనతలు పుట్టుకతో రావు. కాలమే వాటిని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మీ హవా నడుస్తోంది. దాని ఆయుర్దాయం తీరితే మీకైనా ఓటమి తప్పదు. గతంలో ఇందిర, ఎన్టిఆర్‌, వైయస్‌, చంద్రబాబులను ఎవరైనా కదిలించగలరా ! అనుకున్నాం. ఏమైంది ? చరిత్రను చూడండి.
– నువ్వు గొప్ప కవి, పండితుడివే కావచ్చు. కానీ ఎన్టిఆర్‌తో పోల్చుకునే స్థాయి నీకు లేదు. చరిత్రను వక్రీకరించవద్దు.
– యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌పై ముద్దు కృష్ణమ నాయుడి మండిపాటు
– కొన్నాళ్ళు పోతే ‘చంద్రబాబును కూడా నేనే రాజకీయాల్లోకి తెచ్చాను’ అని కూడా అనొచ్చు.
– టిఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి
–  జడ్చర్ల సభలో జైపాల్‌ రెడ్డి
– మళ్లీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడి పార్లమెంటుకు వెళ్తారా ! ఏంటి !
– గుజరాత్‌ ఫలితం మాకు అనుకూలం. ఇక రాహుల్‌ దృష్టి తెలంగాణపై పెడతారు.
– తెలంగాణ కాంగ్రెసు నేతలు
– ఇక్కడ కూడా భాజపా రావాలని మీరు కోరుకుంటున్నారన్నమాట !
– డా|| పి.భాస్కరయోగి  మాటకు మాట, విశ్లేషణ జాగృతి  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి