– తెలంగాణ రాష్ట్రం సోనియా వల్లే వచ్చిందని ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఫిరాయింపుదార్లను అసహ్యించుకొంటున్నారు.
– కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు.
మీరు నిజమే చెపుతున్నారా..
– కళంకిత యుపిఎ కు ఎస్.పి., బి.ఎస్.పి. కొమ్ముకాశాయి.
– భాజపా అధ్యక్షులు అమిత్ షా.
గత యాభై ఏళ్ళ నుండి కాంగ్రెసును భుజాలకెత్తుకున్న సెక్యులర్ పార్టీల నైజం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది.
– ఉగ్రవాదులుగా అరెస్టు చేయబడ్డ ముస్లిం సోదరులకు సీనియర్ న్యాయవాదితో న్యాయసహాయం అందిస్తాం.
– ఎఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసి.
ఖాసిం రజ్వీలను తయారుచేసి సమాజ హితాన్ని ఖతం చేయడమే వీరి లక్ష్యం.
– హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే.
– ప్రొ. కోదండరాం.
ప్రతి విషయాన్ని కేంద్రంపై వేయండి. వీలైతే మోదీని తిట్టేయండి.
– మోదీకి నేను వీరాభిమానిని.
– ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్
కిమ్ గారూ.. మా దేశ సెక్యులర్ వాదులు మీ కార్యాలయం ముందు ధర్నా చేయగలరు జాగ్రత్త !
– జన్మనక్షత్రం వారిగా 4 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని నాటి చరిత్రలో నిలిచిపోవాలి.
– సిఎం కెసిఆర్ ఆదేశం.
వృక్షో రక్షతి రక్షితః, చాలా మంచి నిర్ణయం సార్.
– గొడవలతో ప్రయోజనం లేదు. కెసిఆర్‌తో మాట్లాడేందుకు భేషజం లేదు. అన్నీ వదులుకున్నాం. హైకోర్టును వదులుకోలేమా..?
– సిఎం చంద్రబాబు.
గతం గతః ముఖ్యమంత్రిగారు. ఇప్పుడేం చేయాలో ఆలోచించండి.
– స్పెయిన్ వెళ్ళినప్పుడు అమెరికా అధ్యక్షుడు బుల్ ఫైటింగ్‌కు హాజరు కావద్దు.
– కేంద్రమంత్రి మేనకాగాంధి.
అహింసా పరమో ధర్మః అని అమెరికాకు బోధిస్తున్నారా..
– గ్రామాలను ముంచే ప్రాజెక్టు వద్దు.
– సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.
మరి ఎక్కడ కట్టాలో మీరు చెప్పగలరా..! నీరు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు..
– ఫోన్లు పక్కన పెట్టండి. అవి లేకపోతే జీవితమేం ఆగదు. ఫోన్లతో ఇకనుండి సమావేశాలకు రావద్దు.
– ప్రధాని మోది.
”దేనిమీదైనా నియంత్రణ ఉండాలి” అని చెప్పకనే చెప్పారు సార్.
– ఆందోళనలతో జిల్లాలు రావు.
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
నిజమే. ఆందోళనలతో తెలంగాణ రాదనే అప్పుడు తెదేపాలోనే ఉండిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి