– విద్యార్థులు స్కూళ్లలో హాజరు పలికేందుకు ఎస్‌ సర్‌ / మేడమ్‌ అనే బదులు ‘జైహింద్‌’ అనాలి. ఈ కొత్త హాజరు విధానాన్ని అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి సత్నా జిల్లాలో అమలు చేయాలి.
– మధ్యప్రదేశ్‌ విద్యా శాఖామంత్రి విజయ్‌ షా
– జైహింద్‌ అనే నినాదమిచ్చిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను ఈ జాతి గుండెల్లో పెట్టుకొంది. ఒకప్పుడు హిందూ-ముస్లిం అనే తేడాలు లేకుండా ఉపన్యాసాల చివర, జాతీయ గీతాల చివర జైహింద్‌ అని నినదించేవారు. ప్రస్తుతం ‘సూడో సెక్యులర్‌’ వాదులకు జైహింద్‌ అనేది ఓ భయానక శబ్దంలా కనిపిస్తోంది. సూడో సెక్యులరిజం ఈ దేశానికి పట్టిన దెయ్యం.
– ఆడంబరాలకు పోవద్దు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు.
– రైతులకు సూచించిన ఎంపి వినోద్‌ కుమార్‌
– మీరు ఓ నిర్ణయానికి వచ్చి చెప్తున్నారన్నమాట! గతంలో ఇదేమాట ఓ కేంద్రమంత్రి అంటే అందరూ ఆయనపై ఒంటికాలి మీద లేచారు.
 కాంగ్రెస్‌లో పాతకాలపు నేతలే మిగిలారు
– మంత్రి కెటిఆర్‌
– మీ నాన్న నీవు అమెరికా నుండి రావని నిక్కచ్చిగా చెప్పినందుకు; అధికారం నా కుటుంబానికి అక్కరలేదని ఒకప్పుడు ప్రకటించినందుకు, కాంగ్రెసు వాళ్లు వాళ్ల పుత్రులను, పుత్రికలను ఈ రంగంలోకి దించలేదు. లేకుంటే ఈ పాటికి యువజన కాంగ్రెసు నాయకులే తెరపై కన్పించేవాళ్లు.
– జిఒ 39తో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్న టిఆర్‌ఎస్‌ తన రాజకీయ అవసరాల కోసమే రైతు సమితులను ఏర్పాటు చేసింది.
– గవర్నర్‌కిచ్చిన ఫిర్యాదులో అఖిలపక్ష నేతలు
– బాబు ఆల్‌రెడీ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాక మీరు చేసేది అరణ్యరోదనే. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ముందే ఊహించలేని ప్రతిపక్షం ఉంటే ఎలా అన్నలూ!
– ఐలయ్యకు బెదిరింపు కాల్స్‌ రావడం, ఆయనను బూతులు తిట్టడం, ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం వంటివాటిని మేం ఖండిస్తున్నాం.
– తమ్మినేని వీరభద్రం, సిపిఎం
– తమ్మినేనీ..! మరీ ఇంత మూర్ఖత్వం, మంకు తగదమ్మా! మందకృష్ణ మాదిగ, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ లాంటి దళిత నాయకులే ఐలయ్య చేసింది శుద్ధ తప్పు అంటుంటే మీకెందుకు ధృతరాష్ట్ర ప్రేమ? కులాలను తిట్టడం కులతత్వ నిర్మూలన ఎలా అవుతుంది? కులగజ్జిని మీరు కమ్యూనిస్టు పార్టీ నిండా నింపేశారు. ఇక మీకెవరు చెప్పగలరు !
– పార్టీ ఆదేశిస్తే నల్లగొండలో పోటీకి రెడి
– తెదేపా నేత రేవంత్‌ రెడ్డి
– ఇంకెవరు చెప్పాలి ! మీరే రాజు, మీరే మంత్రి.
– వైశ్యుల వద్ద డబ్బులు తీసుకొని భాజపా, టిఆర్‌ఎస్‌ నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు. తెల్లగా ఉన్నవారంతా ఆర్యవైశ్యులు, నల్లగా ఉన్నవారంతా ద్రావిడ వైశ్యులు.
– వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య
– మరి మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని హిందువుల కులాలపై విషం గక్కుతున్నవ్‌ సార్‌ ?! నీవు పొందిన అవార్డులు, నీ పుస్తకాలకు వచ్చిన ప్రాచుర్యంపై లెక్క తీయమంటావా ? అయినా డా.బాబా సాహెబ్‌ అంబేడ్కరే ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని పామును చంపినట్టు చంపమంటే, నీవు మరో క్రొత్త వివాదం తీస్తావా? ‘కులం ఒక కుట్ర – దాన్ని పడగొట్ర’ అని చెప్పటానికి బదులు ‘కులం చేపట్ర – బహుమతులు కొట్ర’ అన్నట్లు సాగుతోంది నీ వ్యవహారం !
– డా||పి.భాస్కరయోగి మాటకు మాట, విశ్లేషణ జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి