– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
మీరు చేస్తే పరమార్థం, ఇతరులు చేస్తే స్వార్థం. ఏం చెప్పారండీ మంత్రి గారూ!
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓ వ్యక్తి విగ్రహాలు మనకు కన్పిస్తాయి. విగ్రహం చూపించే వేలు ఆ బొమ్మ ఉన్న స్థలాన్ని మాత్రమే కాకుండా వేలు దిశగా ఉన్న ప్రదేశమంతా మాదే అని చాటుతుంది.
– యుపీ నేత ఆజంఖాన్.
”అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మీరు ములాయంకు ఏమీ తీసిపోరు. అదే ఏ భాజపావారో ఆ స్టేట్‌మెంట్ ఇచ్చివుంటే మీరు మోదీ రాజీనామా కోరేవారు! వీలైతే మీడియాలో ఊదరగొట్టేవారు.
- రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. మంచాలు ఎత్తుకెళ్లినవాళ్ళు ముద్ర వేయబడిన దొంగలు, విజయ్ మాల్యా వంటి వారు దేశాన్ని విడిచిపెట్టిన దొంగలు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.
రాహుల్‌జీ! బతికున్నపుడు బట్టలివ్వకుండా చచ్చాక తద్దినం బెట్టడం అంటే ఇదే మరి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, మీరు, మీ అమ్మగారు అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా పరామర్శించని విషయం మరచిపోయారా! అండర్సన్‌ను దేశం దాటించింది ఎవరు నాయనా! గురివింద నీతి మంచిది కాదు రాహుల్‌జి!
- ప్యాకేజీగా పాచి లడ్డూలు! తీసుకోవాలా వద్దా ఏపీ సర్కారుకే వదిలేస్తున్నా.
– పవన్‌కళ్యాణ్, సినీనటుడు.
రాజకీయం సినిమా కాదు. సినిమాల్లో ఉండేది రాజకీయం కాదు. ఈ సత్యం మీ అన్నకు తెలియనందుకే పార్టీని తీసుకెళ్ళి సోనియా కాళ్ళ దగ్గర పెట్టాడు. మరి నీ వెంత ఘనమో, నీ మాటల్లో ఎంత సత్యం ఉందో కాలమే సమాధానం చెప్తుంది.
- మజ్లిస్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ.
– భాజపా నేత కిషన్‌రెడ్డి.
మీరు చెప్పేవన్నీ వాస్తవాలే. కానీ వాటికి పరిష్కారాలేమిటి? ఇది కూడా చెప్పండి కిషనన్నా!
- కోర్టుకు చెప్పేదొకటి. చేసేదొకటి. తప్పుదోవ పట్టిస్తున్న సర్కార్.
– కాంగ్రెస్ నేత ఉత్తమకుమార్‌రెడ్డి.
మరి మీరు ఏం జేస్తున్నారో???
- నేనెంతో సింపుల్, 35 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం నాది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎన్టీఆర్‌ను పాలిటిక్స్‌లోకి రమ్మన్నా, కలాంను రాష్ట్రపతిని చేశా.
– ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
మీరు బాగానే ఉన్నారు కదా! అయినా పోయినవాళ్ళ గురించి కామెంట్ చేయకుంటేనే బాగుంటుందేమో….!
- వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా.
– ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.
‘దింపుడు కళ్ళం ఆశ’ అంటే ఇదే మరి!
- దేశంలోని 20 కోట్లమంది ముస్లింలకు ఏమైనా జరిగితే దేశం కాశ్మీర్‌లా మారుతుంది.
– మాజీ మంత్రి కాంగ్రెస్ నేత బేణీ ప్రసాద్ వర్మ.
అంటే కాశ్మీర్‌లోని రావణ కాష్టానికి మీరే కారకులన్నమాట. దేశంలోని 90 కోట్ల హిందువులకు మేం రక్ష అని మీరు ఎప్పుడైనా అన్నారా?
- జకీర్ నాయక్ మాకు విరాళంగా ఇచ్చిన 50 లక్షలు వాపస్ ఇచ్చేశాం. మా పార్టీని అపఖ్యాతి చేసేందుకు ఎన్డీఏ కుట్ర.
– కాంగ్రెస్ వర్గాలు.
మీరు సయ్యద్ హఫీజ్ నుండి, చచ్చిపోయిన ఒసామా బిన్‌లాడెన్ నుంచి కూడా విరాళం స్వీకరిస్తారు సుమా! మళ్ళీ దబాయింపు లెందుకులే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి