* టిఆర్‌ఎస్ నేతలున్నా వదలొద్దు. డ్రగ్స్, ఆహార కల్తీ అత్యంత ప్రమాదకరం. రక్తాన్ని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. దూకుడు పెంచి డాన్‌లను పట్టుకోండి. మీకు పూర్తి అధికారం, స్వేచ్ఛనిస్తున్నాం. నెలలో కడిగేయండి. మంత్రులున్నా కేసులు పెట్టండి.
– సిఎం కెసిఆర్
నయీం కేసులో కూడా ఇలాగే హడావిడి చేసి, కేసు నీరుగార్చారని ప్రజల అనుమానం. తెలుగు మీడియాకు ఇవాళ ఇంతకన్న ముఖ్య విషయం లేదు. ఇది డైవర్షనా? రివర్షనా? అర్థం కావడం లేదు.
* నా పేరు సిద్ధరామయ్య. బిజెపి వాళ్లే కాదు, నేను కూడా 100 శాతం హిందువునే. కర్నాటకలో బిజెపి తన హిందుత్వ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్నది.
– కర్నాటక సిఎం సిద్ధరామయ్య
మరి నీ ఎజెండా ఏమిటి ? కులాలను ప్రత్యేకంగా గుర్తించ మని అడగడం, ప్రత్యేక జెండాను తయారు చేయడం ఎంతవరకు సబబు ? ‘సిద్ధరామయ్య’లో ‘రామ’ ఉన్నంత మాత్రాన రామభక్తుడవు కాలేవు సార్. ‘నేనూ హిందువునే’ అంటావు. చేసేదంతా హిందూ వ్యతిరేకమే!
* కెసిఆర్ మాయ చేస్తున్నాడు.
– కాంగ్రెసు నేత షబ్బీర్ ఆలీ
మీరింతవరకు ఎటువంటి మాయలు చేయలేదు మరి..!!
* కేంద్రప్రభుత్వం అతివాద ధోరణివల్లే కశ్మీర్ సమస్య ముదురుతోంది.
– మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం
చిదంబర రహస్యాలన్నీ మీకే తెలుస్తాయి మరి ! అయినా కశ్మీర్ విషయంలో మీ తప్పు ఏమీ లేదంటారా ?
* భవిష్యత్తరాల కోసమే హరితహారం.
– తెరాస మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్ రెడ్డి
మీరన్నది నిజమే. కాని మీరు నాటిన మొక్కలను మేకలు తినకుండా ఉన్నప్పుడే కదా హరితహారం సఫలమయ్యేది..!!
* టిఆర్‌ఎస్‌కు ప్రజలు ఘోరీ కడ్తారు
– కాంగ్రెసు నేతలు ఉత్తమ్, పొన్నం
‘నీ ఘోరి గడ్తం కొడుకో తెరాస సర్కరోడా !’ అని పాటలు పాడుతారా ఏంటి ఉత్తమన్నా!
* పాతాళానికి తొక్కాల్సింది టిఆర్‌ఎస్ నే. ప్రాజెక్టులకు అడ్డుకొంటున్నది తండ్రి, కొడుకులే.
– కాంగ్రెసు నేత మల్లు భట్టి విక్రమార్క
మీరేమన్నా బలిచక్రవర్తులా !!
* నాటి నాజీ పాలనలా నేడు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ పాలన సాగుతోంది. ప్రధాని మోది హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు.
– కాంగ్రెసు నేత రాహుల్‌గాంధి
అయ్యా రాహుల్ గారూ ! 1975 జూన్ 25 అర్థరాత్రి నాడు హిట్లర్ మీ నానమ్మను ఆవహించిన సంగతి మరచిపోయారా ?!
* వెంకయ్య సంఘ్‌పరివార్‌కు చెందిన మనిషి. కాషాయ ముసుగు ధరించి ఉపరాష్ట్రపతి అవుతున్నాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు మోది బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారు.
– సిపిఐ నేత నారాయణ
కాషాయం త్యాగానికి ప్రతీక. త్యాగమే భారతీయ సంప్రదాయం. మీకు కాషాయం కన్నా కసబ్ వంటి కసాయిలే నచ్చుతారు !! మీరు మారరు.
* అకున్ సబర్వాల్‌తో బహుబలి-3 తీయండి. మీడియా అతణ్ణి ఆకాశానికి ఎత్తేస్తోంది. చిన్నపిల్లలు ఈ కేసులో ఉంటే ఇలాగే బాధిస్తారా ?
– దర్శకుడు రాంగోపాల్ వర్మ
ఇంకా ఎంటర్ కాలేదేంటా అని చూస్తున్నా ! ప్రతి విషయంలోనూ వేలు పెట్టడం మీకు అలవాటే కదా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి