– కుటుంబ పాలన గురించి కాంగ్రెసు నేతల మాటలు హాస్యాస్పదం. కోడంగల్‌కు కాంగ్రెసు ఏం చేసిందో రేవంత్ చెప్పాలి. రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్..
– మంత్రి లక్ష్మారెడ్డి
– కొందరు ఏలిననాటి శని అయితే మరికొందరు రాహువు, కేతువుల్లా గ్రహణం పట్టిస్తారు. మొత్తానికి అందరూ గ్రహాలే.
– స్వయం ప్రతిపత్తి కోరటం దేశ ద్రోహమైతే నన్నూ అలాగే పిలవండి. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే అంశాల వారీ స్వయంప్రతిపత్తి
– నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా
– మీ కుటుంబం వల్లనే గదా కశ్మీర్ రావణకాష్టంగా మారింది అబ్దుల్లా సాహెబ్ ! ఇంకెన్ని ప్రాణాలు బలిగొంటారు ! ఇంకెన్నాళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు ! గత డెబ్భై ఏళ్ల నుండి మీ కుటుంబం – నెహ్రూ కుటుంబాల స్వార్థబుద్ధి వల్ల భారతదేశం ఎంతమంది వీరులను కోల్పోయింది ! ఎంత ధనం ఖర్చు చేసింది ! అయినా కశ్మీర్ లోయలో దేశభక్తి లేదు. పాకిస్తాన్ జెండా రోజూ రెపరెపలాడుతునే ఉంది. భారత్ వ్యతిరేక నినాదాలు, సైనికులపై రాళ్లు.. ఇవన్నీ వాటి ఫలితాలే కదా ! ఇప్పటికీ శవాలపై కాలుపెట్టి అధికారం పొందాలనుకోవడం దౌర్భాగ్యం కాదా ?! ఇది ఇంకెంత కాలం ?!
– గుజరాత్‌ను ఎవరూ కొనలేరు. జిఎస్టి.. గబ్బర్‌సింగ్ ట్యాక్స్. గుజరాత్ మనకీబాత్ నేను వినిపిస్తా..
– కాంగ్రెసు నేత రాహుల్ గాంధి
– అదే మోది చెబుతున్నది.. గుజరాత్‌ను ఎవరూ కొనలేరని ! మీరెన్ని శీర్షాసనాలు వేసినా గుజరాత్‌లో గడ్డిపరకను కూడా కదిలించలేరు అనేదే అసలు సిసలు వాదన. అదే విషయాన్ని టివి సర్వేలు కూడా చెబుతున్నాయి. మీ ముఖ్య నాయకుడు అహ్మద్ పటేల్ ట్రస్టీగా ఉన్న ఆసుపత్రిలో తీవ్రవాదులకు అండ దొరికిందని వార్తలు గుప్పుమంటున్నాయి. ముందు అది చూసుకోండి.
– టిడిపిలో కెసిఆర్ జీతగాళ్లు.. సిఎంను నిలదీస్తాననే నా పదవులు తీసేశారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కెసిఆర్, అతని వ్యతిరేక శక్తులు మాత్రమే. తెలంగాణను కెసిఆర్ కుటుంబం నుండి విముక్తం చేస్తా.
– రేవంత్ రెడ్డి
– ఏ పార్టీలో కెసిఆర్ జీతగాళ్లు లేరు ? సిఎంతో పని లేకుండానే అన్ని పార్టీల వాళ్లు పైరవీలు, కాంట్రాక్టులు నడిపిస్తున్నారా ! తెలంగాణలో కుల రాజకీయం మొదలైంది. సెంటిమెంటు స్థానంలో కులం కూర్చుంటే ఇలాగే ఉంటుంది. ఏది ఏమైనా కెసిఆర్‌పై యుద్ధం చేయగల బాహుబలి నీవే అని తేలిపోయింది. కాంగ్రెసులోకి నీవు వెళ్తే కొందరు ఖుష్..!! మరికొందరు హుష్..!!
– కొలువుల కొట్లాట సక్సెస్ చేయాలి. ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించి సభను అడ్డుకుంటోంది.
– జెఎసి నేత కోదండరాం
– మీకు కమ్యూనిస్టు పదాలు ఎలా అలవడ్డాయండీ.. !
– ఎపిని పాలించేది చంద్రబాబా.. అంబానీయా?
– వివాదాస్పద రచయిత కంచె ఐలయ్య
– ఏం ! పత్రికలు చదువకుండా, టివిలు చూడకుండా పుస్తకాలు రాస్తున్నవా ఏంది ? చంద్రబాబు ప్రభుత్వం 40 నెలలు పూర్తి చేసుకొన్నాక మీు ముఖ్యమంత్రి ఎవరో తెలియకపోతే ఎలా ?
– శాంతియుత ఆందోళన చేస్తామంటే వద్దంటారా ! రైతులపై సర్కార్ కక్ష పెంచుకుంది.
– పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి
– కెప్టెన్ గారూ ! బహుశా టిఆర్‌ఎస్ వారు మీ గడ్డం చూసి భయపడు తున్నారేమో !
– ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేతకు మంత్రి కోటి అడిగారు. జోనల్ రద్దు చేయాలి. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి.
– ఉద్యోగుల జెఎసి
– మూడేళ్లు అయ్యాక ఇలాంటి డిమాండ్లు చేయడం బాగుండదేమో..! చేతులు కాలాక ఆకులు వెతుక్కోవడం అంటే ఇదే మరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి