• నేతల్ని కొనడం మీ సంస్కృతే. ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌ నేతల కళ్ళు బైర్లు గమ్మాయి. అవినీతిపై మీరా మాట్లాడేది?
  • – కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌పై హరీశ్‌రావు విసుర్లు.
  • హరీశ్‌గారూ! కాంగ్రెస్‌ వాళ్ళను బాగా అర్థం చేసుకున్నారు.
  • మాల్యా రావాల్సిందే…!
  • – వ్యక్తిగత మినహాయింపు రద్దు చేసిన కోర్టు.
  • విజయమాల్యాజీ! ఏ దేశం క్లబ్బులో, ఏ పబ్బు గబ్బులో కాలం గడుపుతున్నారో చెప్పండి ప్లీజ్‌!
  • సామాజిక మాధ్యమాల ద్వారా ఆకట్టుకున్న దానికన్నా, సమాధి నుండే బుర్హాన్‌ యువతను అధికంగా ఆకర్షిస్తాడు. కావాలంటే నా మాటలు రాసిపెట్టుకోండి.
  • – నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా.
  • ఒమర్‌జీ! ప్రస్తుతం తమరు సమాధుల్లోకి వెళ్లి మాట్లాడుతున్నట్టున్నారే! సిగ్గులేకపోతే సరి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మండిస్తున్న ఓ ఉగ్రవాదిని పొగడడానికి. మీ కుటుంబం, నెహ్రూ కుటుంబంవల్లనే ఇంత దుర్దశ దాపురించింది.
  • ప్రతి మొక్క బతకాల్సిందే. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దు. కరవు వస్తే ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేయడం కాదు, అవసరమైతే మొక్కలకు ట్యాంకర్లతో నీళ్లు పోయండి.
  • – ముఖ్యమంత్రి కేసీఆర్‌.
  • ఏం చెప్పినవ్‌ అన్నా! ఏది చెప్పినా పంచ్‌ డైలాగులే! మంచిగా చెప్పినవ్‌!
  • నేను పడిపోయినా వేరేవాళ్ళు నా తుపాకీని పట్టి ముందుకెళుతున్నంతసేపు నాకు నిశ్చింతే. ఈ మాటలు అన్నది చేగువేరా. అవే మాటలు సరిగ్గా బుర్హాన్‌కి సరిపోతాయి.
  • – జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌.
  • సిగ్గులేని ఉపమానాలు ఆపి నోర్మూసుకోండి.
  • కేసీఆర్‌ మోసాలతో భ్రష్టు తెలంగాణ.
  • – కాంగ్రెస్‌ నేత జానారెడ్డి.
  • ఎంతకాలం అర్థం కాకుండా మాట్లాడుతారు. కాస్త అర్థమయ్యేటట్లు మాట్లాడండి. అర్థం లేకుండా చెప్పడం వ్యర్థం.
  • పాలమూరు ముంపును తగ్గించండి.
  • – జేఏసీ ఛైర్మన్‌ ప్రొ||కోదండరాం.
  • మల్లన్న సాగర్‌ టూ పాలమూరు ముంపు
  • కేసీఆర్‌ పాలనలో ఖజానా ఖాళీ, మద్యం ఆదాయంతోనే ప్రభుత్వ పాలన.
  • – తేదేపా నేత రేవంత్‌రెడ్డి.
  • మరీ నిజాలు బహిరంగంగా చెప్పడం బాగుండదేమో!
  •  2019లో కాంగ్రెస్‌దే అధికారం.
  • – కాంగ్రెస్‌ నేత మల్లురవి.
  • దానికేమైనా ఆధారాలున్నాయా….!
  • దేశపు యోజనాలే పరమావధీ! వాటి తర్వాతనే మిగతా వాటికి స్థానం. కాశ్మీర్‌ విషయంలో అన్ని పక్షాలకు ఒకే గొంతు ఉండడంవల్ల ఓ అడుగు ముందుకు వేయగలిగాం.
  • – ప్రధాని మోదీ.
  • తల్లీ భారతీ వందనం.

– డా||పి.భాస్కరయోగి  మాటకు మాటవిశ్లేషణ జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి