మైనారిటీల నమ్మకం, విశ్వాసాలపై దూకుడుగా వ్యవహరించే గ్రూపులు పెరిగిపోతున్నాయి. 1930ల నాటి చీకటి రోజులు మళ్ళా వచ్చేటట్లున్నాయి.
– బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్
ఆ మాట అంకుల్‌శామ్ అమెరికాకు చెప్పండి. జీహాద్‌లు, క్రూసేడ్‌లు సృష్టిస్తున్న మీరే నీతులు చెప్పడం విడ్డూరం. ప్రపంచ వ్యాపారానికి మతాన్ని ఉపయోగిస్తున్న రెండు మతాలవాళ్ళు ప్రపంచ అశాంతికి ఎలా కారణం అవుతున్నారో ఆలోచించండి. ‘పాపులకు పశ్చాత్తాపం కన్నా ఘనమైనది’ లేదు. కనీసం బయటికైనా చెప్పుకోండి.
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం. కమ్యూనిస్టులను ఐక్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
– సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
భద్రం గారూ..! ప్రజలు కోరుకొంటున్నది కూడా అదే. కేరళ, త్రిపురలలో కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటయితే మీ కోరిక సిద్ధించినట్లే. ఇక ‘కమ్యూనిస్టుల ఏకత్వం’ ‘ప్రపంచ కార్మికుల ఏకత్వం’ జరిగే పనేనా? ఇది ఏకం అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. ముందు అది గమనించండి.
మోదీ హఠావో.. దేశ్ బచావో..
– బెంగాల్ సీఎం మమతాబెనర్జీ
ఇంకా ఇందిరాగాంధీ మత్తులోనే ఉన్నారా ఏమిటి ! హఠావో, బచావో పదాలు వదల్లేకపోతున్నారు !!!
నా భార్య ఇచ్చిన నోట్లతో ఢిల్లీకి వెళుతున్నాను ! నోట్ల కష్టాలు నాకూ ఉన్నాయి.
– తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
డిసెంబర్ 30 తరువాత నోట్ల కష్టాలు తీరుతాయని మోదీగారు చెప్తున్నారు కదా మంత్రిగారూ.. !
బిసి కమీషన్‌కు విస్తృత అధికారాలు ఇవ్వడానికి పరిశీలిస్తున్నాం..!
– తెలంగాణ మంత్రి జోగురామన్న
సుధీర్ కమిటీ సిఫార్సులు అమలు చేయడమే కదా విస్తృత అధికారం అంటే…”
ఇంటికో ఉద్యోగం ఏదీ ? తెలంగాణ తెచ్చిన యువతకు అన్యాయం ! పేదల జీవితాలతో కెసిఆర్ చెలగాటం.. !
– పిసిసి ఛీఫ్ ఉత్తమ కుమార్‌రెడ్డి
‘తెలంగాణ ఇచ్చింది సోనియా’ అని మొన్న అన్నారు. ఇప్పుడేమో యువత అంటున్నారు ! ఇంతకీ తెలంగాణ ఎవరు ఇచ్చారు ? ముందు ఈ విషయం తేల్చండి ఉత్తమ్ అన్నా..!
పీక్కుతింటున్న దుష్ట చతుష్టయం. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
– మాజీ కాంగ్రెస్ ఎంపి బలరాం నాయక్
మీరేదో ఇంతకుముందు గుప్త రాజుల్లా పాలించినట్లు….!! అదే స్వర్ణయుగం అయినట్లు….!!
అపహాస్యం మాని ఆరోపణలపై సమాధానం చెప్పండి!
– సీపీఐ నేత సువరం సుధాకర్‌రెడ్డి
మీరంతా మోదీకి బావమరుదులా..! మీతో సరసాలు, అపహాస్యాలు ఆడడానికి.. !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి