– మూడున్నరేళ్లలో చేసిన అరెస్టులు జీవితంలో చూడలేదు; అసెంబ్లీలో మాట్లాడనివ్వరు. బయట నిరసన తెలపనివ్వరు…!
– కాంగ్రెసు నేత జానారెడ్డి
– ‘పెద్దలు’ జానారెడ్డిగారూ! అని కెసిఆర్ మిమ్మల్ని సంబోధిస్తూంటే ఎన్నోసార్లు మీరు మురిసిపోయారని అసెంబ్లీ లాబీల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అయినా మీరు అరెస్టు అయ్యింది తక్కువసార్లేగా !
– క్లబ్‌కు వెళ్లినప్పుడు 20 నిమిషాలు నిలబడి వేచి చూస్తాం. ఇష్టమైన రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అరగంటైనా ఓపిగ్గా ఎదురు చూస్తాం. జాతీయ గీతాలాపనకు కోసం 52 సెకన్లు నిలబడలేమా?
– క్రికెటర్ గంభీర్
– భేష్ గౌతమ్ ! చాలా ‘గంభీరమైన’ మాటలు చెప్పావ్. నీ దేశభక్తి అందరికీ స్ఫూర్తిదాయకం.
– వచ్చే ఎన్నికల్లో కెసిఆర్‌ది ఇంటి దారే
– సిపిఐ నేత చాడ వెంకట్‌రెడ్డి
– ఎవరు అధికారంలో ఉంటే వారిని ఇంటి దారి పట్టిస్తామనడం కమ్యూనిస్టుల పెడదారికి నిదర్శనం.
– మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం వెనుక మంత్రి కెటిఆర్ బావమరిది రాజ్ పాకాలకు మంత్రి అండదండలు. రక్త పరీక్షలకు నేను సిద్ధం. కెటిఆర్ సిద్ధమా!
– కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి
– కెటిఆర్ బావ మరిదిని కూడా రాజకీయాల్లో తెస్తారా ఏంటి ? అనవసరంగా ఆయన పేరు ప్రజల్లో నానేటట్లు చేస్తున్నారు. సినిమా యాక్టర్లకు చేసిన రక్త పరీక్షలకే ఇంతవరకు దిక్కులేదు. మీకెందుకు టెస్ట్‌లు !
– ఒక్క గజం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.
– జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
– కలెక్టర్ దేవసేనను అడిగితే తెలుస్తుంది నీ జాతకం ఏంటనేది !
– అధికారులకు ప్రజలు గతంలో రూ.వెయ్యి లంచం ఇచ్చి పనులు చేయించుకొనే వారు. ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు చేయడంతో ఇప్పుడు రూ.2 వేలు ఇవ్వాల్సి వస్తోంది. ఇదీ మోదీ ప్రభుత్వం సాధించిన ఘనత.
– సిపిఎం నేత సీతారాం ఏచూరి
– అంటే ఇన్నేళ్లు అవినీతిని మీరే పెంచి పోషించినట్లు ఒప్పుకుంటున్నారన్న మాట. ఇదీ మీరు ఇన్నేళ్లలో సాధించిన ఘనత.
– రెండు టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఆర్థిక వ్యవస్థపై మోదీ బాంబులు.
– కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– చర్చ అక్కర్లేకుండా అబద్ధాలను ప్రచారం చేస్తే పలుకుబడి పెరుగుతుందని మీకు ఎవరు చెప్పారు ? ‘మోది నియంత, అమిత్‌షాకు అహంకారం, ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయ్యింది, ప్రజాస్వామ్యం లేదు’ వంటి పదాలతో గోబెల్స్ ప్రచారం చేయడం మీకే చెల్లింది. ఇదంతా కమ్యూనిస్టులు మీకు ఇచ్చిన ట్రైనింగేనా?
– ఉన్నది చెత్త సచివాలయం. అద్భుతంగా కొత్తది కడతాం. కట్టి తీరుతాం. ఎవరో చెప్పింది చేయం. ప్రజలకే జవాబ్దారీ.
– సిఎం కెసిఆర్
– ఓ నియంత మాట్లాడినట్లు చక్కగా సెలవిచ్చారు !
– స్పీకర్‌గారూ! మీరు సభ నడిపే పద్దతి మాకు నచ్చలేదు.
– స్పీకర్ మధుసూదనాచారి వద్ద ప్రతిపక్షాలు
– వాళ్ల సభ వాళ్ల ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే వాకౌట్ ఉందిగా!
– లవ్ జిహాద్ దేశానికి పెనుముప్పు. దాని మాటున కేరళలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి.
– కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
– మరి దూకుడు ప్రదర్శించండి ! గట్టి చర్యలు తీసుకోండి.
– హిందువుల్లో ఉగ్రవాదులున్నారు. హిందుత్వలో ఉగ్రవాదం ఉంది.
– నటుడు కమలహాసన్
– భారతదేశంలో రాజకీయాల్లోకి రావాలనుకునేవారు, పాపులారిటీ పొందాలనుకునేవారు మొదట హిందుత్వను తిట్టాలనే భ్రమల్లో ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇదంతా వామపక్ష మీడియా ప్రభావం అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో కూడా అర్థం కావడం లేదు. అసలు ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో హిందుత్వను తిట్టి పైకొచ్చిన నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా ? నీవు కూడా అంతే కమల్ ! ‘దశావతారం’ చూసిన వాళ్లు నిన్నేదో ‘జాతీయవాది’ అని మురిసిపోయారు. కానీ నీ ఒంట్లో మార్క్సు, స్టాలిన్, లెనిన్ నిద్రపోతున్నప్పుడు ఎవరేం చేస్తారు ! నీవెప్పుడైతే ‘వామ బాట’ పట్టావో అప్పుడే ప్రజల హృదయాల్లో స్థానం కోల్పోయావ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి